ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్ ఇవాళ కూడా తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు సునిశిత వ్యాఖ్యలు చేసింది. స్విస్ చాలెంజ్ విధానం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిపికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ నిన్న ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Sep 19 2016 5:37 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement