సర్టిఫికెట్ల కోసం విద్యార్థి అవస్థలు | students problems in private college for certificates | Sakshi
Sakshi News home page

Sep 9 2015 6:13 PM | Updated on Mar 21 2024 8:58 PM

ప్రైవేటు కళాశాలలో చేరడమే వారు చేసిన తప్పా? కాలేజీ ప్రవేశాల సమయంలో కాలేజీ యాజమాన్యాలే ఇళ్లకు వచ్చి మరీ విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకుంటారు. కానీ, సర్టిఫికెట్ల కోసం మాత్రం చివరలో విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. తన సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ విద్యార్థి కాలేజీ అధికారుల కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా కళాశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ కాలేజీలో వెలుగు చూసింది. ఆ విద్యార్థి, తన తల్లిదండ్రులతో పాటు కాలేజీకి చేరుకుని అధికారులను బతిమాలాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement