టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి తన నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఎవరిని చూసినా.. చంద్రబాబుకు అనుమానం కలుగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నాయకులందరిని అనుమానంతో చూస్తున్న బాబు ఇప్పుడు తన ఇంట్లో పనిచేస్తున్న వారని కూడా వదలడం లేదు. తన ఇంట్లో పని చేస్తున్న అందర్ని ఆయన తొలగించినట్టు తెలుస్తోంది.