తండ్రి కొడుకుల మధ్య ఇప్పటికైతే రాజీ లేదు! | Ongoing suspense on crisis in the SP | Sakshi
Sakshi News home page

Jan 4 2017 6:58 AM | Updated on Mar 21 2024 7:48 PM

సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభంపై మంగళవారం కూడా ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సైకిల్‌ గుర్తును తమకే కేటాయించాలంటూ అఖిలేశ్‌ వర్గం ఢిల్లీలో ఈసీకి విన్నవించింది. మరోవైపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న ములాయం సింగ్‌ యాదవ్‌తో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. దీంతో తండ్రీకొడుకుల మధ్య రాజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సంధి యత్నాలు ఫలించలేదని అఖిలేశ్‌ వర్గం నేతలు తేల్చిచెప్పారు. అఖిలేశ్‌ విధేయ నేతలు రాంగోపాల్‌ యాదవ్, నరేష్‌ అగర్వాల్, కిరణ్మయ్‌ నందలు ఎన్నికల సంఘాన్ని కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement