పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి తోట నర్సింహం తన స్వగ్రామం వీరవరంలో శనివారం వీరంగం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలోకి ఆయన తన అనుచరులతో కలిసి హల్ చల్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి తోట నర్సింహం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఏజెంట్లను పరుష పదజాలంతో తిట్టారు. అం తేకాకుండా మీ అంతు చూస్తానంటూ బెదిరించారు. బూతులు తిడితూ తన ప్రతాపం చూపారు. అయితే ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తు నిలబడ్డారు. నర్సింహం వైఖరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాగా తోట నర్సింహం సతీమణి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దాంతో మంత్రి అనుచరులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారు. ఎన్నికల అధికారులకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. అలాగే కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం కొండవాయపల్లెలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓటర్లతో ప్రమాణం చేయించుకుంటున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ ఘటనపై మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో మీడియా సిబ్బంది ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Jul 27 2013 11:34 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement
