రాజధాని ఎవరి చేతికి? | master-developer-to-select-for-ap-capital | Sakshi
Sakshi News home page

Apr 22 2015 8:32 AM | Updated on Mar 22 2024 11:13 AM

నూతన రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ కంపెనీలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో మాస్టర్ డెవలపర్ ఎంపిక అంశాన్ని చేర్చారు. సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపి మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు తొలుత చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు అధికార యంత్రాంగం గండి కొట్టింది. 2001లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ చట్టం -2001’ ఆధారంగా.. సంప్రదింపుల ద్వారా మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఆ చట్టంలోని సెక్షన్ 19లో ఉన్న ‘ప్రపంచంలో ఎక్కడా లేని ప్రాపర్టీ, టెక్నాలజీ ఉన్న కంపెనీతో నేరుగా సంప్రదింపులు జరిపి డెవలపర్‌గా ఎంపిక చేయవచ్చు’ అన్న క్లాజ్‌ను ఆధారంగా తీసుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడం సాధ్యం కాదంటూ అధికార యంత్రాంగం పలు నిబంధనలను ఉటంకించింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement