పంజాబ్‌లోని పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని లోపాలు దోహదం చేశాయని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ అంగీకరించారు. సుదీర్ఘ రక్షణగోడ ఉన్న ఎయిర్‌బేస్ లోపలికి ఉగ్రవాదులు ఎలా చొరబడగలిగారన్నది ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. అయితే భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్నీ బాహాటంగా చర్చించలేమన్నారు. పరీకర్ మంగళవారం ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులందరినీ నిర్మూలించటం జరిగిందని.. అయితే స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.