కృష్ణా నదీ జలాల విష యంలో ఆంధ్రప్రదేశ్ మరో కొత్త వివాదాన్ని లేవనెత్తింది. గోదావరి పరీవాహకం నుంచి కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న హైదరాబాద్‌కు నీటిని తరలించడంపై అభ్యంతరం తెలిపిం ది.ఎంతసేపూ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తరలించే గోదావరి జలాల్లో వాటా కోసం తెలంగాణ చేస్తున్న ఫిర్యాదునే పరిశీలిస్తున్నా రని... తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న జలాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని బోర్డును ప్రశ్నించింది. ‘‘తెలంగాణ హైదరాబాద్‌కు నీటి సరఫరా పేరుతో గోదావరి ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరుల నుంచి కృష్ణా బేసిన్‌కు జలాలను తరలిస్తోంది. బోర్డు ఈ అంశాన్ని పట్టించుకోకుండా పట్టిసీమపైనే దృష్టి సారించి, నీటి వాటాలు తేల్చుతోంది. ఇది మాకు ఆమోదయోగ్యంకాదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు గురువారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు వెంటనే వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయ డం కలకలం రేపుతోంది. పట్టిసీమ అంశాన్ని తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని రెండున్న రేళ్లుగా దాటవేస్తూ వస్తున్న ఏపీ సర్కారు.. తాజాగా హైదరాబాద్‌కు నీటి సరఫరా అంశా న్ని లేవనెత్తడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Jan 13 2017 7:25 AM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement