సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు కొత్తకాదు. కానీ ఈ కేరళ ప్రేమకథ కాస్త భిన్నం. అతనేమో పూర్తిస్థాయి రాజకీయ నాయ కుడు. ఆమె స్వతంత్రభావాలు కలిగిన యువ అధికారిణి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.ఎస్.శబరినందన్, తిరువనంతపురం సబ్ కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్‌లు ప్రేమలో పడ్డారని గత కొంతకాలంగా కేరళలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరకు మంగళవారం శబరినందన్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌ను మార్చి దీన్ని ధ్రువీకరించారు.