నేను క్షేమంగానే ఉన్నా: నీలిమ | Hyderabad based mountaineer Neelima reportedly is safe | Sakshi
Sakshi News home page

Apr 28 2015 4:29 PM | Updated on Mar 20 2024 3:51 PM

ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లి.. ఆపై ఆచూకీ గల్లంతైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 21 మంది బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ ఆచూకీ లభించినట్లు సమాచారం. నీలిమ తన మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయిన సంగతి తెలిసిందే. అయితే వీరు చేరుకోవాల్సిన బేస్‌క్యాంప్‌లో భూకంప ప్రభావం అంతగా లేదనిసమాచారం. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. వీరిలో కొందరు తాము సురక్షితంగానే ఉన్నట్లు అమెరికాలోని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement