గ్రేటర్ ప్రజలపై ఆస్తిపన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఓ వైపు ఖజానా నిల్వలు రోజురోజుకూ తగ్గడం... మరోవైపు చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ్యయం వందల కోట్ల రూపాయల్లో ఉండటం... ఇప్పటికే ఆస్తి పన్ను జాబితాలో లేని ఇళ్లు, నివాస భవనాల్లో కొనసాగుతున్న వాణిజ్య భవనాల గుర్తింపు వంటి చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నును సైతం పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది.