దమ్ము, ధైర్యంలేని కాంగ్రెస్,టిడిపి

విలువలతో పోరాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు ఆమె ఇక్కడకు వచ్చారు. ఆ రెండు పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో జగనన్నను జైలులో పెట్టించారన్నారు. జగనన్న జైలులో ఉన్నా పులేన్నారు.

వెన్నుపోటుదారు చంద్రబాబును తరిమి..తరిమి కొట్టాలని షర్మిల పిలుపు ఇచ్చారు. తన కొడుకు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు. హైదరాబాద్ తన వల్లే అభివృద్ధి చెందినట్లు గొప్పలు చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు ఉన్న విలువైన భూములను తన వారికి అమ్ముకున్నారన్నారు. చార్మినార్‌ను మీరే కట్టారా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి న్యాయం చేసే సత్తా మీకు లేదు..ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి అని అన్నారు. న్యాయం జరిగేంత వరకు ప్రజలతో కలిసి పోరాడుతామని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top