భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.