నేత కార్మికుల ఇబ్బందులను తొలగించి వారి సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. చేనేత, మర మగ్గాల కార్మికుల స్థితిగతులు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతిభవన్‌లో శనివారం ఆయన సుదీర్ఘం గా సమీక్షించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హ్యాండ్లూమ్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు, చేనేత సంఘాల నాయకుడు జెల్లా మార్కండేయులు సమీక్షలో పాల్గొన్నారు.