తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నుంచి ఎర్రచందనం ఎంతో కాలంగాహైదరాబాద్‌కు అక్రమ రవాణా అవుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తంగడపల్లి వద్ద మాటువేసి లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీ అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలను ఉంచి, పైన బత్తాయి కాయల బస్తాలను వేసి, ఎవరికీ అనుమానం రాకుండా, రవాణా చేస్తున్నారు. గురువారం పట్టుబడ్డ లారీలో 44బస్తాల బత్తాయిలున్నాయి. ఎక్కడ లారీని ఆపినా, ఎవరికీ అనుమానం రాదు. చూడడానికి బత్తాయిల లోడు లాగే ఉంటుంది. ఈ బత్తాయి కాయలు కూడా అమ్మడానికి పనికొచ్చేవి కావు. బత్తాయి గ్రేడింగ్‌లో తీసేసే కాయలను బస్తాల్లో నింపి, ఇలా ఎర్ర చందనం అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు.