ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన విషయంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిదే తప్పని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తేల్చింది. ఆమె తన సరిహద్దు దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లారని కేబినెట్ వెల్లడించింది. రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ దాడి విషయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు మంత్రివర్గం మొత్తం అండగా నిలిచింది.