మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టులో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీపీ డీఎస్పీ బి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్‌లోని సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.