భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి స్పీడ్‌కు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తక్షణం బ్రేకులు వేస్తుందని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి)లో వృద్ధి కేవలం 7 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తన క్రితం 7.6 శాతం అంచనాలను కుదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) 7.1 శాతం అంచనాలకన్నా ప్రపంచబ్యాంక్ తాజా అంచనాలు తక్కువ కావడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి తగ్గినా... రానున్న సంవత్సరాల్లో మళ్లీ వృద్ధి 7.6 శాతం, 7.8 శాతానికి పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలే దీనికి కారణమనీ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ధోరణులపై ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదల చేసింది. నవంబర్ 8వ తేదీన దేశంలో డీమోనిటైజేషన్ ప్రభావం, తదుపరి పరిణామాలను ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో విశ్లేషించింది.
Jan 12 2017 7:33 AM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement