మానవతావాది న్యాయవాది లేబాక తులసిరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : దివంగత న్యాయవాది లేబాక తులసిరెడ్డి నిజమైన మానవతావాది అని హైకోర్టు న్యాయవాది రతంగపాణిరెడ్డి తెలిపారు. దివంగత తులసిరెడ్డి జ్ఞాపకార్థం పెన్నానది ఒడ్డున ఉన్న స్వరూప్ ఎస్టేట్‌లో తులసిరెడ్డి కుమారుడు లేబాక హృతిక్‌రెడ్డి, తమ్ముడు లేబాక గంగిరెడ్డి, మేనల్లుడు మధుసూదన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. న్యాయవా ది లేబాక తులసిరెడ్డి వల్ల ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. పైసా ఆశించకుండా వందలాది మందికి ఉద్యోగాలు, పోస్టింగ్‌లను ఇప్పించారని తెలిపారు. అనంతపురం ఎస్‌కే యూని వర్సిటీలో సీట్లు ఇప్పించడంలోను, హాస్టల్ వసతి కల్పించడంలో ఎందరికో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్‌లో తులసిరెడ్డి చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి హాజరై, తులసిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారు సుమారు 400 మందికి పైగా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ రామగంగిరెడ్డి, హైకోర్టు న్యాయవాది మహేశ్వరరెడ్డి, అనంతపురం అడ్వకేట్లు శ్యామ్, నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి (చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి), మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ బీవీరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్దన్‌రెడ్డి, అడిషనల్ పీపీ మార్తల సుధాకర్‌రెడ్డి, మెట్టుపల్లె సుధాకర్‌రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వైద్యులు త్యాగరాజరెడ్డి, స్వరూప్‌కుమార్‌రెడ్డి, హెడ్‌మాస్టర్ రాంభూపాల్‌రెడ్డి, దొంతిరెడ్డి హనుమంతరెడ్డి, అశ్విన్‌కుమార్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ స్వరూప్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సింగం భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


