రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం
● అరుదైన వన్యప్రాణుల స్మగ్లింగ్‌లో నలుగురు అరెస్ట్
● స్థానిక ఎస్సార్కె లాడ్జీలో నిందితులను విచారించిన అధికారులు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇన్‌టెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారిని పట్టణంలోని ఎస్సార్కె లాడ్జ్‌లో మధ్యాహ్నం నుంచి 9 గంటలకు పైగా విచారణ చేస్తుండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమికూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు, అధికారులు, పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జ్‌ను మొత్తం వారి అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీశాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరాజుపేటకు చెందిన ఆటోడ్రైవర్ మొలకల సుబ్రమణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచారిలను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పూడుపాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారివద్దనుండి కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదుపులోకి తీసుకొన్న వారితో అధికారులు, లాడ్జీ ముందు గుమికూడిన జనం
రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం


