గాంధీ విగ్రహం ఎదుట నిరసన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ఉపాధిని హరించే జీ–రామ్–జీ అనే నూతన బిల్లును బీజేపీ లోక్‌సభలో బలవంతంగా ఆమోదింపజేసిందని దీనిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఐటిఐ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మకద్రోహమని, ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్వేష్, దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రరెడ్డి జమీల, వెంకటేశ్వర్లు, నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, నారాయణరెడ్డి, శంషాద్, విజయ్, తిమ్మయ్య, ప్రవీణ్ కుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు.


