వెంటనే రద్దు చేయాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆయా కళాశాలలను 33 ఏళ్ల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50 శాతం తగ్గించడం, 50 శాతం సీట్లను మార్కెట్ రేట్లతో అమ్మడం వంటి నిర్ణయాలు వల్ల ఫీజులు అమాంతం పెరుగుతాయి. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య సేవలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. – డీయం.ఓబులేసు
ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు


