21న తొలి తెలుగు శాసనం నమూనా ఆవిష్కరణ
కడప సెవెన్‌రోడ్స్: ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని తొలి తెలుగు శాసనానికి తయారు చేసిన నమూనాను ఈనెల21న కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠం మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్, ప్రముఖ రచయిత, చరిత్రకారులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. గతేడాది కలమల్లలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయు డు తొలి తెలుగు శాసనంపై స్పందించారు. శాసనం అందరికీ అందుబాటులో ఉండాలంటే నమూన తయారు చేసి ప్రతిష్ఠించాల్సిన అవసరముందని భావించారు. అందుకు సరైన వేదిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంగా గుర్తించారు. ఆయన మానస పుత్రిక స్వర్ణభారత్ ట్రస్టు తరఫున నమూన తయారు చేయిస్తామని హామి ఇచ్చారు. ఆ మేరకు నమూన సిద్దమైంది. ఈనెల 21న బ్రౌన్ గ్రంథాలయంలో నమూన స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఐ.దీప వెంకట్ ఆవిష్కరించనున్నారు. అధికారభాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రివిక్రమరావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
తొలి తెలుగుశాసన ప్రతిరూపం
కలమల్లలోని
శాసనం
21న తొలి తెలుగు శాసనం నమూనా ఆవిష్కరణ


