నేడో రేపో ఆదేశాలు...
పదో తరగతి నూరు రోజుల ప్రణాళిక కార్యక్రమ అమలుకు సంబంధించి ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారి లేదా మండల గెజిటెడ్ అధికారిని నియమించాం. వారు వారానికి రెండు రోజులు వారికి నియమించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత జాబితాను కలెక్టర్‌కు పంపించాం. ఆయననుంచి ఒకటి రెండు రోజలు సంబంధిత జాబితా విడుదల అవుతుంది. జాబితా విడుదలైనప్పటి నుంచి నియమించిన అధికారులు వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. –షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి


