అవినీతి నిర్మూలనకు కృషి చేస్తాం
కడప అర్బన్: సమాజంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ‘అవినీతి’కి పాల్పడినా తమ దృష్టికి నేరుగాగానీ, టోల్ ఫ్రీ నెంబర్ ‘1064’కుగానీ, డీఎస్పీ ఫోన్ నెం. 94404 46191కు సమాచారం ఇవ్వాలని, నిరంతరం అందుబాటులో ఉంటామని కడప ఏసీబీ నూతన డీఎస్పీ సీతారామారావు అన్నారు. గురువారం ఆయన కడపలోని అవి నీతి నిరోధకశాఖ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డితో కలిసి అవినీతి నిరోధకశాఖకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు టోల్‌ఫ్రీ నెంబర్: 1064తో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన వివిధ ప్రాంతాలలో ఎస్‌ఐగా, సీఐగా విధులను నిర్వర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో స్పెషల్‌బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తూ కడప అవినీతి నిరోధకశాఖ డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పోలీసుశాఖతో పాటు, ఏ ప్రభుత్వశాఖలోనైనా అవినీతి అధికారులున్నా ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు.
అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెం ‘1064’కు సమాచారం ఇవ్వండి
కడప నూతన ఏసీబీ డీఎస్పీ సీతారామారావు వెల్లడి


