ప్రైవేటుకు కట్టబెడితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల ఏర్పాటును సంకల్పించి కొన్నింటిని పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ తన ఆలోచనలను పునరాలించుకోవాలి. – యూసఫ్, విద్యార్థి, దువ్వూరు
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు. ఈ విషయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇందుకు విద్యార్థి లోకం స్వచ్చందంగా మద్దతు ఇస్తోంది. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసేలా చంద్రబాబు సర్కార్ తన నిర్ణయాన్ని పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
– గుత్తిరెడ్డి కార్తీక్‌రెడ్డి, విద్యార్థి, కడప
వైద్య విద్యను దూరం చేయరాదు
చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం సరికాదు. వైద్య రంగంవైపు వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థి వైద్య విద్యను అభ్యసించాలని కలలు కంటాడు. అయితే చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో ఆ కల కల గానే మారిపోతుంది. ముఖ్యమంత్రి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. – అబ్దుల్ రోషన్, విద్యార్థి, కడప
ప్రైవేటుకు కట్టబెడితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం
ప్రైవేటుకు కట్టబెడితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం


