విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన అవసరం
కడప అగ్రికల్చర్ : విద్యార్థి దశ నుంచే విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇప్పపెంట గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వ్యవసాయ అనుబంధ శాఖల గురించి తెలుసుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.అంకయ్య కుమార్ , ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.కృష్ణప్రియ, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పంటల సాగు, తెగుళ్లు, పురుగుల మందుల వాడకం గురించి తెలియజేశారు. తిరుపతి, మహానంది, ఉదయగిరి వ్యవసాయ కళాశాలల అసోసియేట్ డీన్‌లు రెడ్డిశేఖర్, జయలక్ష్మి, క్రిష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు రైతుల అనుభవాలను తెలుసుకొని మంచి దిగుబడులు ఎలా సాధించాలో నేర్చు కోవాలని సూచించారు. మండల అధ్యక్షుడు గంధం మోహన్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
బుక్కే చంద్రానాయక్


