జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు రెడ్డిస్వాతి
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పరిధిలోని నిర్మల ఫార్మసి కళాశాలకు చెందిన ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. పులివెందుల జేఎన్‌టీయూలో జరిగిన యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పోటీలలో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జేఎన్‌టీయూ యూనివర్సిటీ జట్టుకు ఎంపికై ంది. 2026 జనవరిలో కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొని కళాశాల, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ మోహన్‌కుమార్ సూచించారు. రెడ్డి స్వాతిని నిర్మల ఫార్మసి కళాశాల చైర్మన్ బి. శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ మెహన్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగరాజు, కళాశాల సిబ్బంది అభినందించారు.


