కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి ఉత్తరాఖండ్ బ్యాటర్లు తడబడటంతో రెండవ రోజే ఆంధ్రా జట్టుకు విజయం వరించింది. బుధవారం రెండవ రోజు 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 71.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆనంద్ జోషయ్య 58 బంతులకు 1 సిక్సర్, 4 ఫోర్లతో 49 పరుగులు, మన్విత్ కుమార్ రెడ్డి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ జట్టులోని నిషు పటేల్ 5 వికెట్లు, లక్ష్య రాయ్‌చందాని 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 36 ఓవర్లకు 102 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లక్ష్యరాయ్‌చందాని 30 పరుగులు, ఆయుష్ దేశ్‌వాల్ 25 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని ఏఎన్‌వీ లోహిత్ ఉత్తరాఖండ్ బ్యాటర్లపై చెలరేగి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు, రాజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 10.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 20 పరుగులు, హానీష్ వీరారెడ్డి 35 పరుగులు చేశారు. దీంతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్ జట్టు ఆంధ్రా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. దీంతో ఆంధ్రా జట్టుకు 7 పాయింట్లు లభించాయి.
ఏఎన్‌వీ లోహిత్,
ఆంధ్రా (5 వికెట్లు)
రాజేష్, ఆంధ్రా
(4 వికెట్లు)
కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు
కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు


