ఖోఖో జిల్లా జట్టు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా ఖోఖో జూనియర్, సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జె.నరేంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంపిక నిర్వహించామన్నారు. జూనియర్స్ ఖోఖో జట్టు క్రీడాకారులకు కేఎన్‌ఆర్ ఎస్టేట్ (సుధీర్) స్పాన్సర్ చేశారు. అలాగే సీనియర్స్ జిల్లా ఖో ఖో జట్టుకు పురుషులకు యునిక్స్ బ్యూటీ సెలూన్ నిర్వాహకులు, మహిళల జట్టుకు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి (యోగి వేమన యూనివర్సిటీ) క్రీడా దుస్తులు అందించారు. ఈ ఎంపికలకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శివ బాబు, డాక్టర్ కె.రామ సుబ్బారెడ్డి, నారాయణ పాఠశాల ఏజీఎం హరీష్ బసవరాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో తమ ప్రతిభను చాటి ఉమ్మడి కడప జిల్లా క్రీడాకారులు విజయకేతనం ఎగురవేయాలని కోరారు.
జూనియర్స్ బాలుర జట్టు ..
అయాన్ బాబు, అశోక్, నాగ చైతన్య, రామకష్ణ, వెంకట అనిల్ కుమార్, హేమంత్, శివ, ధనుంజయ్, మహేష్, ముఖేష్, రాఘవ, శ్రీకాంత్, ఎతీష్ , వెంకటకృష్ణ, హేమంత్ రాజు.
జూనియర్స్ బాలికల జట్టు..
ధరణి, సాహితీ, ప్రసన్న, రెహనాబీ, దీక్షిత, జానకి లహరి, వెంకట ప్రణవి, గంగ లావణ్య, అనుపమ, హరిత, లోహిత, యోగ రాయల్, వైష్ణవి, అశ్విని, వెంకట నందిని.
సీనియర్స్ మహిళల జట్టు ..
గాయత్రి, లక్ష్మీదేవి, ప్రతి, అఖిల, లక్ష్మీ ప్రసన్న, వాసంతి, స్నేహలత, జయశ్రీ, వందన, రంగమ్మ, కమలమ్మ, సత్యవాణి, హాసిని, చైత్ర, రాధిక.
సీనియర్స్ పురుషుల జట్టు ..
రామ్మోహన్, సుధీర్, రాము, లక్ష్మణ్, గోవింద రెడ్డి, ఖాదర్ రెడ్డి, వీరేష్, అయ్యబాబు, చంద్రశేఖర్, హరి ప్రసాద్, షేక్ సుభాన్, ప్రేమ్ పృథ్వీరాజ్, శ్రీనాథ్, సునీల్, వెంకట నరేంద్ర ఎంపికయ్యారు.


