డ్రోన్ కెమెరాల వితరణ
కడప అర్బన్ : శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యు.సి.ఐ.ఎల్) తరపున రూ. 3 లక్షల విలువైన రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌కు కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్)లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి కంపెనీ జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్ అందజేయగా వాటిని పులివెందుల సబ్ డివిజన్‌కు కేటాయించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో సాంకేతికత పాత్ర కీలకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ బి.మురళి, ఆర్.కె. వ్యాలీ సీఐ ఉలసయ్య, వేముల ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, యు.సి.ఐ.ఎల్ డీజీఎం కిషోర్ భగత్, సి.ఎస్.ఆర్ ఇన్‌చార్జి నవీన్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) తారక్ పాల్గొన్నారు.


