
పెరిగిన నీటి ప్రవాహం
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇటీవల మైలవరం మండలం వేపరాల సమీపంలో యువకుడు గల్లంతు కావడం.. ఆతని ఆచూకి లభ్యం కాకపోవడంతో నీటినినిలుపుదల చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. తాజాగా మైలవరం జలాశయం నుంచి అధికారులు పెన్నాలోనికి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 4.5టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట జలా శయం నుంచి మూడు గేట్ల ద్వార పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మైలవరం ఇరిగేషన్ అధికారులు నీటిని 11వేల క్యూసెక్కుల మేర పెన్నానదిలోనికి విడుదల చేస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పెన్నా పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.