
వైఎస్సార్‌సీపీ హయాంలో..
కడప ఎడ్యుకేషన్: ఊరి బడికి పెద్ద ఆపద వచ్చింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేడు ప్రభుత్వ పాఠశాలలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా జిల్లాలోని పలు గ్రామాల్లో పాఠశాలలు మూతపడే దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలకు తాళాలుపడ్డాయి. ఉన్న ఊర్లో బడులు మూతపడటంతో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను దూరాభారమైనా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఆర్థిక భారాన్ని భరించలేక ఆపసోపాలు పడుతున్నారు.
పచ్చని పల్లెల్లో....
పచ్చని పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణలో విద్యను అందించే ప్రభుత్వ బడులు ఇప్పడు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దశాబ్దాల తరబడి వేలాది మంది పిల్లలకు ఓనమాలు దిద్దించిన ఊరిబడికి తాళాలు పడుతున్నాయి. ఇది పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాల తీరుతో విద్యా వేత్తలు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ బడుల విలీన ప్రక్రియ, క్లస్టర్ విధానాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
1, 6వ తరగతుల్లో
తగ్గిన విద్యార్థుల సంఖ్య...
ఈ ఏడాది 1వ తరగతిలో విద్యార్థుల చేరిక సంబంధించి 2530 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. గతేడాది 1వ తరగతిలో 29,667 మంది విద్యార్థులు చేరగా ఈ ఏడాది ఆ సంఖ్య కాస్తా తగ్గి 27,137 మందికి చేరింది. అలాగే 6వ తరగతిలో కూడా ఈ ఏడాది 2091 మంది విద్యార్థులు తగ్గారు. గతేడాది 6వ తరగతిలో 33309 మంది విద్యార్థులు చేరగా ఈ ఏడాది ఆ సంఖ్య 31218కి పడిపోయింది. ఇలా ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ఏమైపోతుందోననే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణల ఫలితం
జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలకు తాళాలు
ఉన్న ఊర్లో బడి మూసేయడంతోప్రైవేటువైపు పిల్లల అడుగులు
ప్రభుత్వ బడుల్లో పడిపోయిన విద్యార్థుల చేరికలు
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఓ వెలుగు వెలిగాయి. నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. కార్పొరేట్ పాఠశాలలకు మించి బడిలో సకల సౌకర్యాలు చేరాయి. ముఖద్వారం మారిపోయింది. కొత్త డెస్కులతో.. డిజిటల్ బోర్డులతో తరగతి గది అందంగా ముస్తాబైంది. వాష్‌రూంలో శుభ్రత వచ్చి చేరింది. మొత్తంపై పాఠశాల ఆవరణమే కొత్తగా మారి వెలుగులీనింది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపడం మాన్పించి ఉన్న ఊర్లోని ప్రభుత్వ బడులకు పంపించారు.