మా గ్రామంలో పాఠ శాల ఉన్నప్పుడు నేను వంటమనిషిగా ఉపాధి పొందే దాన్ని. ఇప్పుడేమో మా గ్రామంలోని పాఠశాలకు చెందిన 3,4,5 తరగతులను పక్కూరికి పంపడంతో మిగతా తరగతుల పిల్లలు తక్కువ ఉండటంతో వారు కూడా వేరే పాఠశాలల్లో చేరిపోయారు. దీంతో గ్రామంలోని పాఠశాల మూతపడింది. నాకు జీవనోపాధి పోయింది.
– మారే నాగజ్యోతి, వంటమనిషి, జొన్నవరం ప్రాథమిక పాఠశాల, అట్లూరు
పేద పిల్లలు చదువుకు దూరం
మా గ్రామంలో పాఠశాల మూతబడటంతో మా గ్రామానికి చెందిన పేద పిల్లలు చదువులకు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు పెట్టుకుని కొందరు ప్రైవేటు పాఠశాలలకు పంపడంతో వారికి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. కొంతమందికి అలా పంపే స్థొమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చుకు ఇబ్బందులు పడే పేదవారు బడిమానేసే ప్రమాదం కూడా ఉంది.
– దప్పిలి రామలక్ష్మయ్య,
పెండ్లిమర్రి గ్రామం, కలసపాడు మండలం
అందరూ ప్రైవేటు పాఠశాలలకే..
పిల్లలు లేక మా గ్రామంలో ఉండే పాఠశాల మూతపడింది. దీంతో గ్రా మంలోని ఆ కొద్దిమంది చిన్నారులు 13 కిలో మీటర్ల దూరంలో ఉండే వేంపల్లిలోని ప్రైవేటు పాఠశాలకు వెళ్లుతున్నారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికి గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తప్పనిసరి కావడంతో పిల్లలను ప్రైవేటు బళ్లకు పంపుతున్నారు. – సుబ్బారెడ్డి, కత్తలూరు గ్రామం, వేంపల్లి మండలం
ఉపాధి కోల్పోయా..
ఉపాధి కోల్పోయా..