
వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
బ్రహ్మంగారిమఠం : జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాస కళ్యాణోత్సవానికి బి.మఠం సిద్ధమైంది. ఇప్పటివరకూ స్వామికి ఏటా మహాశివరాత్రి, జయంతి రోజున కల్యాణ వేడుక నిర్వహించేవారు. భక్తులు, ఉభయదాతల విన్నపం మేరకు ప్రతినెలా స్వామి కల్యాణం నిర్వహించేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో ప్రత్యేక కళ్యాణ మండపం నిర్మించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారి పేరుతో ఉన్న ఈ మండపంలో ప్రథమ మాస కళ్యాణోత్సవాన్ని శుద్ధ ద్వాదశి రోజున నిర్వహించనున్నారు. ప్రతినెలా శుద్ద ద్వాదశి నాడు మాస కళ్యాణం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. శాశ్వత ఉభయదాతలుగా చేరుటకు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మఠం పిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ తెలిపారు.
క్రీడల అభివృద్ధే లక్ష్యం
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘం పటిష్టత, క్రీడల అభివృద్ధే తమ లక్ష్యమని ఏపీ పీఈటీ అండ్ ఎస్‌ఏ పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్‌కిరణ్, ఎస్‌ఏపిఈ ఆసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శివశంకర్‌రెడ్డి తెలిపారు. కడప శంకరాపురంలోని స్కౌట్ హాల్‌లో విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాలోని ఏపీ పీఈటీ అండ్ ఎస్‌ఏ పీఈటీ ఆసోసియేషన్, ఎస్‌ఏ పిఈటీ అసోసియేషన్‌లను విలీనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబయ్య, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల విక్రయం నిలిపివేత
కడప అగ్రికల్చర్ : కడప నగరంలోని మార్కెఫెడ్ ఎరువుల గోదామును జిల్లా వ్యవసాయ అధికారి(జేడీఏ) బి.చంద్రానాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. నిల్వలు పరిశీలించి జిల్లా వ్యాప్తంగా డీర్లు, ఆర్బీకే, పీఎసీఎస్ కేంద్రాలకు ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయశాఖ కర్నూలు డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏవో గోవర్ధన్, వ్యవసాయాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి సంయుక్తంగా కడప పట్టణంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. అనుమతి పొందిన పురుగుమందులు అమ్మాలని, రైతులకు రసీదు ఇవ్వాలని సూచించారు. రికార్డులు సరిగా నిర్వహించని 26.94 లక్షల విలువ గల వాటర్ సాలిబుల్ ఎరువుల విక్రయం నిలిపివేసినట్లు వారు తెలిపారు.

వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు

వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు