
ఉపాధ్యాయుల వేతన సమస్యలను పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి కోరారు. జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లును శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌లో టీచర్ల బదిలీలు జరగ్గా.. రీఅపోర్షన్‌లో భాగంగా నూతన పాఠశాలలలో చేరిన ఉపాధ్యాయులకు వెంటనే పొజిషన్ ఐడీలను కేటాయించాలన్నారు. జూన్ నెల నుంచి వేతనం చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 24 ఏళ్లు పూర్తయిన టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్ మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చూడాలని, పదవీవిరమణ చెందిన టీచర్లకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపడంలో జాప్యం చేయవద్దని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు హరిబాబు, జిల్లా కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, రామసుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.