
యోగాతో ఆరోగ్య యోగం
కడప ఎడ్యుకేషన్: యోగాతోనే సర్వ మానవాళికి ఆరోగ్య యోగం సిద్ధిస్తుందని దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ని బుధవారం కడప ఇండోర్ స్టేడియంలో ముందస్తు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగా మంత్‘నేటి నుంచి మొదలైందన్నారు. జూన్ 21న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నా రు. ఈ నేపథ్యంలో ఒక యాప్‌ని కూడా ప్రారంభించారని.. ఆ యాప్‌లో అందరూ రిజిస్టర్ కావచ్చన్నారు. మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతలకు యోగ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జేసీ అదితిసింగ్ మాట్లాడారు. కలెక్టర్ యోగాసనాలు వేసి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, డిపివో రాజ్యలక్ష్మి, డిఎంహెచ్‌ఓ నాగరాజు, జెడ్పి సీఈవో ఓబులమ్మ, జిల్లా అధికారులు, ఆయుష్ సిబ్బందిపాల్గొన్నారు.
పచ్చదనాన్ని పెంపొందించాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా అభివృద్ధిలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 20 లక్షలు మొక్కలు నాటాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని బోర్డు రూం హాల్లో డీఎఫ్ వినీత్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మొక్కల పెంపకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రెండు దశలలో జూన్ 27వ తేదీ పది లక్షల మొక్కలు, ఆగస్టు 29వ తేదీన పదిలక్షలు మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడపలో ప్రారంభమైన ప్రపంచ యోగా ముందస్తు వేడుకలు