
కడప విమానాశ్రయంలో మాక్ డ్రిల్
కడప అర్బన్ : ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడికి దిగితే ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో వివరించేలా ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో కడప విమానాశ్రయంలో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, వైద్యం, అగ్ని మాపక శాఖల సమన్వయ చర్యలను ఏఎస్పీ మూర్తి పరిశీలించారు. డ్రిల్‌లో కమలాపురం సీఐ ఎస్‌కె.రోషన్, వల్లూరు ఎస్‌ఐ బి.పెద్ద ఓబన్న, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక అధికారులు చురుకుగా పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో విభిన్న విభాగాల మధ్య సమన్వయం, స్పందన వేగం మరియు తక్షణ చర్యలపై స్పష్టత పెరిగిందని అధికారులు తెలిపారు.