
గౌరవం లేదు.. వేతనం రాదు
కాశినాయన : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మంలో ఏ పనులు చేయించలేని పరిస్థితి తమకు ఉండడంతో గౌరవం లేకుండాపోయిందని, దానికి తోడు కనీసం రెండేళ్ల నుంచి గౌరవ వేతనాలు అందలేదని పలువురు ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కడ ప జిల్లాలో 559 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.3వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఎంపీటీసీలకు చెల్లించలేకపోయింది. 2024 జూలై, 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలు వుదీరింది. అంతకుముందు పెండింగ్ వేతనాలతోపాటు దాదాపు రెండేళ్ల గౌరవ వేతనం రావాల్సి ఉంది. నేటికీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలచే ఎంపికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వసభ్య సమావేశాలకే పరిమితం
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారుల సమస్యలను తీసుకువచ్చినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని చెబుతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరుపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, వివక్షకు గురిచేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
పలువురు ఎంపీటీసీల ఆవేదన