
విద్యుత్ షాక్‌తో రెండు బర్రెలు మృతి
చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్‌తో రెండు బర్రెలు మృతి చెందాయి. మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని ఏపీజీబీ బ్యాంకుకు ఎదురుగా శనివారం రాత్రి ఏర్పడిన గాలి, వాన బీభత్సానికి విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దళితవాడకు చెందిన శ్రీనివాసులు, నాగులమ్మకు చెందిన బర్రెలు పొలంలో మేత మేస్తుండగా రోడ్డు వైపు వచ్చాయి. అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైన బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రెండు బర్రెల విలువ రూ.30వేలు పైగా ఉంటుందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అట్లూరులో..
అట్లూరు : మండల పరిధిలోని కుమ్మరవారిపల్లి గ్రామానికి చెందిన అంబవరం అనసూయమ్మ గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు అనసూయమ్మకు చెందిన పాడి గేదె రోజు మాదిరిగానే పచ్చిక మేసేందుకు పొలాలకు వెళ్లింది. సాయంత్రం వరకూ ఇంటికి రాక పోవడంతో పొలాల్లోకి వెళ్లి వెతకగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర న్యూట్రల్ వైరుకు విద్యుత్ సరఫరా అయి మృతి చెంది ఉంది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతో గేదె మృత్యువాత పడిందని రూ.70 వేలు విలువ చేసే గేదె మృతికి కారకులైన ట్రాన్స్‌కో అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని బాధితురాలు కోరారు.