
● మేయర్ సురేష్‌బాబుపై కక్ష సాధింపు
● ‘ఎస్ మేడమ్’.. అనకపోతే ప్రతీకారమే
ఎమ్మెల్యే మాధవీరెడ్డి పార్టీలో అంకితభావంతో పని చేసిన వారి పట్ల అయినా.. సానుకూలతతో ఉన్నారా? అంటే.. అది కూడా కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. ఎస్..మేడమ్ అన్నోళ్లు మినహా తక్కిన వారందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆ పార్టీ నుంచి ఎంపికైన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి పట్ల కార్పొరేషన్ సమావేశంలో.. ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించిన తీరును పలువురు ఉదహరిస్తున్నారు. ఇవన్నీ కూడా నడిమంత్రపు హోదా కారణంగా జరుగుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా.. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వ్యవహరిస్తున్నారు. నిత్యం ఏదో ఓ కారణంతో.. వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. కడప గడపలో మునుపెన్నడూ లేని రీతిలో రాజకీయ దుమారం రేపుతున్నారు. ప్రత్యర్థులపై ప్రతీకారేక్షతో విరుచుకుపడుతున్నారు. అడ్డుగా నిలుస్తున్నారనుకున్న వారందరిపై.. తరతమ భేదం లేకుండా.. అధికారం అడ్డుపెట్టుకొని వేటు వేస్తున్నారు. ఆపై ప్రత్యక్షంగా నోరు పారేసుకుకోవడం కూడా చేస్తున్నారు. నడిమంత్రపు హోదానే దుష్ట సంప్రదాయానికి ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ ముసుగులో పార్టీ ప్రతిష్టను పాతిపెట్టేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు.
పార్టీ నగర అధ్యక్షుడిపై దాడి
జిల్లా కేంద్రమైన కడపలో ప్రశాంత వాతావరణం ఉండేది. గడిచిన ముప్పై ఏళ్లుగా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు లేవు. కాగా మాధవీరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేసిన తర్వాత ఉద్రిక్తత వాతావారణం కడప గడపలో ఉత్పన్నమైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేయర్ సురేష్‌బాబు ఇంటిపై చెత్త వేయించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ‘వీపులు విమానం మోత మోగుతాయ’ని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవీ ప్రత్యక్ష బెదిరింపులకు దిగడం.. ఇవన్నీ కూడా టీడీపీ ప్రతిష్టను దిగజార్చనున్నట్లు పలువురు వివరిస్తున్నారు.
టపాసులు పేల్చుతూ కవ్వింపులు
కడపలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహారశైలి కన్పించడంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు, మాజీ మంత్రి అంజద్‌బాషా సోదరుడు అహమ్మద్‌బాషా ఓ కేసులో అరెస్టు అయితే, వారి ఇంటికి కూత వేటు దూరంలో ఎమ్మెల్యే అనుచరులు టపాసులు పేల్చడం, మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటు వేయగానే కార్పొరేషన్ వద్ద టపాసులు పేల్చడం, ఇలాంటి కవ్వింపు చర్యలు మునుపెన్నడూ కడపలో కన్పించడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుతో
విసిగి పోతున్న తెలుగు తమ్ముళ్లు
నడిమంత్రపు హోదానే కారణమంటున్న విశ్లేషకులు
ప్రతి సందర్భంలోనూ కవ్వింపు చర్యలు
దిగజారుతున్న టీడీపీ ప్రతిష్ట
ప్రశాంతతకు నిలయమైన కడపలో దుష్ట సంప్రదాయం
నష్టనివారణ చర్యలు ఎలా?
ఎమ్మెల్యే ఏకపక్ష చర్యల కారణంగా టీడీపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. నష్ట నివారణ చర్యలు ఎలా అనే సందిగ్ధంలో ఆ పార్టీ సీనియర్లు పడ్డారు. మునుపెన్నడూ లేని రాజకీయ కక్ష సాధింపు చర్యలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ఆవేదనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో జెండా మోసి కష్టనష్టాలను భరించిన వారి పట్ల కూడా సానుకూలత లేదని పలువురు వాపోతున్నారు. అదే విషయాన్ని బాహాటంగా తెలుగుతమ్ముళ్లు వెల్లడించలేని దుస్థితిలో ఉండటం గమనార్హం. మహానాడు సందర్భంగా రాష్ట్ర ముఖ్యనేతల దృష్టికి కడపలో నెలకొన్న పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలనే దిశగా ఆ పార్టీ శ్రేయోభిలాషులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
కడప మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటుతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర దుమారం రేగుతోంది. రూ.36 లక్షల విలువైన కాంట్రాక్టు పనుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని.. ఏకంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చి చెప్పినా చర్యలకు ఉపక్రమించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సురేష్‌బాబు.. ముఖ్యమంత్రులుగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. కాంట్రాక్టు పనులే కావాలనుకుంటే వందల కోట్ల పనులు చేసి ఉండేవారు కదా? అని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు. రాజకీయంగా అడ్డు నిలుస్తున్నారనే భావనతోనే మేయర్‌పై దొంగదెబ్బ తీశారని పరిశీలకులు పేర్కొంటున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కాంట్రాక్టు సంస్థ పనులు చేయరాదంటూ నిలువరించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా.. మేయర్‌పై మాత్రమే చర్యలు చేపట్టడం వెనుక కక్ష సాధింపే ప్రధాన కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

● మేయర్ సురేష్‌బాబుపై కక్ష సాధింపు

● మేయర్ సురేష్‌బాబుపై కక్ష సాధింపు

● మేయర్ సురేష్‌బాబుపై కక్ష సాధింపు

● మేయర్ సురేష్‌బాబుపై కక్ష సాధింపు