కడప ఎడ్యుకేషన్ : 8వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాథకుమార్ శుక్రవారం విడుదల చేశారు. 66 శాతం బాలురు, 34 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫైన్ ఆర్ట్స్, ప్లానింగ్ విభాగాల్లో 84 శాతం విద్యార్థులు ప్రథమ, 16 శాతం మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. తక్కువ సమయంలో ఫలితాల విడుదలకు కృషి చేసిన సిబ్బందిని వీసీ అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఫణీంద్రరెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయప్రకాష్‌రెడ్డి, నారపరెడ్డి, వి.శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.