కన్నుల పండువగా కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా కల్యాణోత్సవం

May 17 2025 5:56 PM | Updated on May 17 2025 5:56 PM

కన్ను

కన్నుల పండువగా కల్యాణోత్సవం

జమ్మలమడుగు : నారాపుర వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామి సర్వభూపాల అలంకారంలో పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చెక్కభజన చేస్తూ స్వామికి స్వాగతం పలికారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై భూదేవి, శ్రీదేవి సమేతంగా నారాపుర స్వామిని కొలువు దీర్చి వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

పోలీసుల అదుపులో ఇద్దరు ఆప్ఘన్లు

కడప అర్బన్‌ : ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్‌ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నగరం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ పార్కు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆప్ఘనిస్తాన్‌ దేశానికి చెందిన అసదుల్లా, ఓవాస్‌ అని గుర్తించారు. భారతదేశానికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. నంద్యాలలో కొంతకాలం ఉన్నారు. రెండు నెలల కిందట కడపకు వచ్చారు. ఈ క్రమంలోనే కడపలో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పనిచేస్తూ అక్రమంగా తలదాచుకుంటున్నారు. పోలీసులు ఎంబీసీకి రిపోర్టు పంపనున్నారు. తర్వాత వారి దేశానికి తరలించనున్నట్లు సమాచారం.

వాహనం బోల్తా.. ఒకరి మృతి

తాడిపత్రి : మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్‌ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్‌ హుస్సేన్‌ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్‌ గాయపడ్డారు. ఘటనపై రూరల్‌ పీఎస్‌ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కోడి కత్తితో అన్న, వదినపై దాడి

నిమ్మనపల్లె : అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత కక్షలు కత్తులతో దాడి చేసుకునే వరకూ దారి తీశాయి. మాటామాటా పెరిగి క్షణికావేశంలో కోడి కత్తితో సొంత తమ్ముడే.. అన్నా, వదినలపై దాడికి దిగారు. తీవ్రగాయాలతో వారు ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పంచాయితీ యానాది కాలనీకి చెందిన ఎర్రప్ప(30), శ్యామల(24) నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ దుర్గంవారిపల్లె వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎర్రప్పకు గత కొద్ది రోజులుగా తమ్ముడు హనుమంతుతో వ్యక్తిగత వివాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎర్రప్ప తన భార్య శ్యామలతో కలిసి సొంత పనులపై బండ్లపై గ్రామానికి వచ్చారు. తిరిగి రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో దుర్గంవారిపల్లె పొలం వద్దకు వెళ్తున్నారు. తన అన్న వచ్చిన విషయం తెలుసుకున్న ఎర్రప్ప తమ్ముడు హనుమంతు, తన స్నేహితుడు అశోక్‌, మరో వ్యక్తితో కలిసి అడ్డగించి కోడి కత్తులతో అన్నా, వదినలపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నుల పండువగా కల్యాణోత్సవం 1
1/2

కన్నుల పండువగా కల్యాణోత్సవం

కన్నుల పండువగా కల్యాణోత్సవం 2
2/2

కన్నుల పండువగా కల్యాణోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement