
పార్టీ అధ్యక్షుడిని కలిస్తే.. రాజీనామా చేస్తారా !
మైదుకూరు : మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలవడంతో.. మనస్థాపంతో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర చెప్పడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూమైదుకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా ప్రకటనపై ఆయన స్పందిస్తూ సొంత పార్టీ అధ్యక్షున్ని కలవడం నేరం కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చంద్ర వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, తన వద్దకు, కార్యాలయానికి రాలేదన్నారు. టీడీపీ, జనసేన పార్టీలోకి వెళ్దామని చెబుతున్నారని కౌన్సిలర్లు కొందరు తన దృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. రెండు నెలల కిందట మున్సిపల్ చైర్మన్‌పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలియడంతో కౌన్సిలర్లు ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డిని కలిసి విషయం తెలిపారన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని ఎంపీతోపాటు, తానూ కౌన్సిలర్లకు చెప్పామన్నారు. కౌన్సిలర్ల కోరిక మేరకు తాను మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్లు రఘురామిరెడ్డి వివరించారు. మూడు నెలలుగా అడుగుతున్నా జగన్ వద్దకు తనను తీసుకెళ్లలేదని చైర్మన్ చెప్పడం అవాస్తవమని అన్నారు. ప్రొటోకాల్ ప్రకారం చైర్మన్ నేరుగా కలవవచ్చని పేర్కొన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టాలనుకున్నప్పుడే మున్సిపల్ చైర్మన్‌కు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ బీఫారం ఇచ్చి కౌన్సిలర్లను గెలిపించిందని, వారు పార్టీకే విధేయులని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహబూబ్‌షరీఫ్, భరత్‌కుమార్‌రెడ్డి, వెంకటసుబ్బన్న, పిల్లి నాగయ్య, ఏసీకే.వెంకటరమణ, కో ఆప్షన్ సభ్యులు ఎంఆర్‌ఎఫ్.సుబ్బయ్య, ట్రాక్టర్ గౌస్, వార్డు ఇన్‌చార్జులు జిలాన్, భూమిరెడ్డి సుబ్బరాయుడు, ఖాదర్, కేపీ.లింగన్న, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
అవిశ్వాసం అన్నప్పుడే వైఎస్ జగన్, అవినాష్‌రెడ్డి గుర్తుకొచ్చారా?
మున్సిపల్ చైర్మన్‌పై మాజీ ఎమ్మెల్యే
శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆగ్రహం