
కల తీరకుండానే.. కానరాని లోకాలకు
కలసపాడు : కష్టపడి చదివించిన తండ్రి.. తాను కన్న కలలు కుమారుడు నెరవేరుస్తాడని ఆందనపడ్డాడు. తొమ్మిది నెలల కిందట ఓ యువతికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించిన తండ్రి ఇక తన కుమారుడికి ఏ లోటు లేదనుకున్నాడు. ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. ఉన్నపాటుగా తన కుమారుడు రైలు కింద పడి మృతి చెందాడని సమాచారం రావడంతో గుండెలు బాదుకుంటూ బెంగళూరుకు వెళ్లాడు. బెంగళూరులో రైలు కింద పడి శివానందరెడ్డి గురువారం మృతిచెందాడు. బంధువులు, స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మహానందిపల్లె గ్రామానికి చెందిన బిజివేముల పుల్లారెడ్డికి ఒక్కగానొక్క కుమారుడు శివానందరెడ్డి(25). ఇతడి తల్లి 15 ఏళ్ల కిందట మృతి చెందింది. అప్పటి నుంచి తన కుమారుడి భారం మోస్తూ కష్టపడి చదివించాడు తండ్రి పుల్లారెడ్డి. తొమ్మిది నెలల కిందట పోరుమామిళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహంజరిపించాడు. తండ్రి కలలు నెరవేర్చాలనే ఉద్దేశంతో శివానందరెడ్డి బెంగుళూరులో ఓ కంపెనీలో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరాడు. శుక్రవారం ఉదయం బెంగళూరులో రైలు కింద పడి తన ఒక్కగానొక్క కుమారుడు శివానందరెడ్డి మృతిచెందాడని తండ్రి పుల్లారెడ్డికి సమాచారం అందింది. దీంతో గుండెలు బాదుకుంటూ కుమారుడి కోసం బెంగళూరుకు బయలుదేరాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రైలు కింద పడి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య