
ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కడప ఎమ్మెల్యే మాధవీకి కార్పొరేటర్లంతా ఘనంగా స్వాగతం పలికి ఎంతో గౌరవించారు. కానీ ఆమె మమ్మల్ని చులకన భావంతో చూసింది. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మేయర్ ఇంటిపై చెత్త వేయించింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు నిబంధనల ప్రకారం ఎక్కడ కుర్చీ వేయాలో అక్కడే వేశారు. దాన్ని ఎమ్మెల్యే అవమానంగా భావించి ఇలా రాద్దాంతం చేయడం దారుణం. – రామలక్ష్మణ్‌రెడ్డి,
13వ డివిజన్ కార్పొరేటర్
ఎమ్మెల్యేకు కుర్చీ మాత్రమే కావాలి
ఎమ్మెల్యే మాధవికి మేయర్‌తో సమానంగా కుర్చీ మాత్రమే కావాలి. ప్రజా సమస్యలు అక్కర్లేదు. కార్పొరేటర్లను టీడీపీ లో చేర్చుకునేందుకు వారి హోటళ్లపై దాడులు చేయించింది. వాటర్‌ప్లాంట్లను కూల్చి వేయించేందుకు ప్రయత్నించింది. ఇవన్నీ సఫలం కాకపోవడంతో చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టు కుని మేయర్‌పై అనర్హత వేటు వేయించారు. కార్పొరేషన్‌లో ఎమ్మెల్యేకు ఎక్కడా అవమానం జరగలేదు. ఆమైకె ఆమె అవమానం జరిగినట్లు ఊహించుకుని కక్ష సాధిస్తోంది. న్యాయస్థానంలో పోరాటం చేసి అదే స్థానంలో కూర్చొబెడతాం.
– ఐస్‌క్రీమ్ రవి, 23వ డివిజన్ ఇన్‌ఛార్జి
అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ
మేయర్‌పై ప్రభుత్వం అనర్హత వేటు వేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. ఇలా చిన్నచిన్న విషయాలను అడ్డు పెట్టుకుని పదవి నుంచి తొలగించడం అప్రజాస్వామికం. అధికారం చాన్నాళ్లు ఉండదన్న సత్యాన్ని టీడీపీ నాయకులు గ్రహించాలి.
– త్యాగరాజు, 26వ డివిజన్ ఇన్‌చార్జి

ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం

ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం