
లారీ బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం మట్టిని తరలిస్తున్న లారీ బోల్తా పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి మట్టిని తరలిస్తూ ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న లారీ పులివెందుల రింగ్ రోడ్డు సమీపంలోని అంబకపల్లి రోడ్డు వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం డ్రైవర్‌ను కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.