
పలు కేసుల్లో నిందితులకు రిమాండ్
కాశినాయన : మండలంలో గ్యాంబ్లింగ్, డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో గ్యాంబ్లింగ్, అక్రమ మద్యం అమ్ముతున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
రెండు బైకులు ఢీ
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని మున్సిపాలిటీ పరిధి గడ్డంవారిపల్లె సమీపంలో మంగళవారం రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరుకు చెందిన ఎస్‌పీ సుబ్రహ్మణ్యం బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉదయం విధులకు మోటార్ బైక్‌పై బయల్దేరాడు. బద్వేలు సమీపంలోని లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ బైక్‌పై మైదుకూరుకు వస్తున్నాడు. వీరు ఇరువురి బైకులు గడ్డంవారిపల్లె వద్ద ఢీకొన్నాయి. సంఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యంను మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కర్నూలుకు తీసుకెళ్లారు.
రైలు కింద పడి వృద్ధుడి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందినట్లు రేణిగుంట ఎస్‌ఐ తెలిపారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన ఏనుగ బాలమ్మగారి చెన్నారెడ్డి మంగళవారం ఉదయం 6.30–7.00 గంటల ప్రాంతంలో రైలు కిందపడి మృతి చెందాడన్నారు. మృతుడికి దాదాపు 69 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.
ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
కలసపాడు : మండలంలోని ముద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బైరెడ్డి నాగార్జునరెడ్డి అనే ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ తిమోతి తెలిపారు. ఆయన వివరాల మేరకు నాగార్జునరెడ్డి సెలవుపై ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 1వ తేదీన విధులకు వెళుతున్నానని ఇంటి వద్ద చెప్పి వెళ్లాడు. కానీ తాను పనిచేస్తున్న ఉత్తరాఖండ్ రెజిమెంటల్‌కు వెళ్లలేదని, ఇంటికి కూడా రాలేదని అతని తండ్రి మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నాగార్జునరెడ్డి ఆచూకీ ఎవరికై నా తెలిస్తే 9121100632 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిద్దవటం : మండలంలోని ఎస్. రాజంపేట గ్రామ సమీప పొలాల్లో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండగా సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, సిద్దవటం అటవీశాఖ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తిరుపతి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
రాయచోటి టౌన్ : నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఐదు డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
ఇరువురికి గాయాలు

పలు కేసుల్లో నిందితులకు రిమాండ్