
మహానాడుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కడప అర్బన్ : కడప నగర శివార్లలో చింతకొమ్మదిన్నె పరిధిలో ఈనెల 27, 28, 29 తేదీలలో జరగనున్న ’మహానాడు’ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు వీఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్.ఎస్.జి ఎస్.పి ఆరిఫ్ హఫీజ్, ఎస్.ఎస్.జి డైరెక్టర్ నచికేత్ విశ్వనాథ్, ఎస్.ఎస్.జి ఎస్.పి జి.హెచ్ భద్రయ్యలతో కలిసి జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, ఏ.ఆర్. డీఎస్పీ కె.శ్రీనివాస రావు , ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.