
రాష్ట్రంలో అసమర్థ పాలన
పులివెందుల : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికలప్పుడు ప్రజలకు అనేక అబద్దపు హామిలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ హామీలను నెరవేర్చడంలో లేదని ధ్వజమెత్తారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
మా ఉద్యోగాలు కాపాడారు..
స్థానిక ఐజీ కార్ల్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సోమవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విధులకు రావద్దని చెప్పగా.. వారు గతంలో ఎంపీ దృష్టికి తీసుకురాగా ఆయన పార్టీ తరపున ఉద్యోగాల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వారు ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు..
సోమవారం ప్రజాదర్బార్‌లో ఎంపీని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కలిశారు. ఫైనలియర్ అయిపోయినా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని, దీంతో క్యాంపస్ అధికారులు పూర్తిస్థాయి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి ఎంపీ స్పందిస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, ఇప్పటికే పార్టీ తరపున విద్యార్థుల కోసం ఆందోళనలు చేశామని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు.
వైఎస్ అభిషేక్‌రెడ్డి స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం
సోమవారం పట్టణంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో దివంగత నాయకుడు వైఎస్ అభిషేక్‌రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను ఎంపీ అవినాష్‌రెడ్డి మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభినవ్‌రెడ్డిలతోపాటు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్ అభిషేక్‌రెడ్డి చిత్ర పటానికి ఎంపీ పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వేల్పుల రాముల, వరప్రసాద్, శశికాంత్‌రెడ్డి, కోడి రమణ, కిశోర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి